||సుందరకాండ ||

||పదునాలుగవ సర్గ తెలుగు తాత్పర్యTatvadipika 14ముతో||

|| Sarga 14 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ చతుర్దశస్సర్గః

శ్లో|| స ముహూర్తమివ ధ్యాత్వా మనసా చాధిగమ్యతామ్|
అవప్లుతో మహాతేజాః ప్రాకారం తస్య వేశ్మనః||1||శ్లో

స|| సః మహాతేజః ముహూర్తమివ ధ్యాత్వా మనసా తాం (సీతాం) అధిగమ్య తస్య వేశ్మనః ప్రాకారం అవప్లుతః||

తా|| ఆ మహాత్ముడు ధ్యానము చేసి ఒక క్షణములో సీతను చేరి, ఒక గంతులో ఆ ప్రాకారము చేరెను.

శ్లో|| సతు సంహృష్ట సర్వాఙ్గః ప్రాకారస్థో మహాకపిః|
పుష్పితాగ్రాన్ వసన్తాదౌ దదర్శ వివిధాన్ ద్రుమాన్||2||
సాలాన్ అశోకాన్ భవ్యాంశ్చ చంపకాంశ్చ సుపుష్పితాన్|
ఉద్దాలకాన్ నాగవృక్షాం శ్చూతాన్కపిముఖానపి||3||

స||ప్రాకారస్థః సః మహాకపిః సర్వాఙ్గః సంహృష్టః వివిధాన్ వసంతాదౌ ద్రుమాన్ పుష్పితాగ్రాన్ దదర్శ|| సాలాన్ అశోకాన్ భవ్యాంశ్చ సుపుష్పితాన్ చంపకాశ్చ ఉద్దాలకాన్ నాగవృక్షాన్ కపిముఖాన్ ( కపిముఖవర్ణ) చూతాన్ అపి (దదర్శ)||

తా|| ప్రాకారము మీద వున్న, ఉత్సాహముతో పులకించిన సర్వాంగములు కల ఆ హనుమంతుడు, వసంతఋతువు రావడముతో పుష్పించిన వృక్షములను చూచెను. అక్కడ సాల అశోక భవ్య వృక్షములను, బాగుగా పుష్పించిన చంపక వృక్షములను, ఉద్దాలక, నాగ వృక్షములను, కపిముఖవర్ణముగల మామిడి ఫలములతో వున్న చెట్లను చూసెను.

శ్లో|| అథామ్రవణ సంచ్చన్నాం లతాశతసమావృతామ్|
జ్యాముక్త ఇవ నారాచః పుప్లువే వృక్షవాటికామ్||4||

స|| అథ (సః హనుమాన్) ఆమ్రవణ సంచ్ఛన్నామ్ లతాశత సమాకులామ్ వృక్షవాటికాం జ్యాముక్తః నారాచః ఇవ పుప్లువే||

తా|| హనుమంతుడు మామిడి చెట్లతోనూ వందలాది తీగెలతోనూ నిండి యున్న వనవాటికను ధనస్సులోనుంచి వదిలిన బాణము వలే దూసుకుంటూ పోయెను.

శ్లో|| సప్రవిశ్య విచిత్రాం తాం విహగైరభినాదితామ్|
రాజతైః కాఞ్చనైశ్చైవ పాదపైః సర్వతో వృతామ్||5||
విహగైర్మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననామ్|
ఉదితాదిత్య సంకాశాం దదర్శ హనుమాన్ కపిః||6||
వృతాం నానావిధైర్వృక్షైః పుష్పోపగఫలోపగైః|
కోకిలైః భృఙ్గరాజైశ్చ మత్తైర్నిత్య నిషేవితామ్||7||
ప్రహృష్ట మనుజే కాలే మృగపక్షి సమాకులే|
మత్తబర్హిణసంఘుష్టాం నానాద్విజాగణాయుతామ్||8||

స|| సః తాం (అశోకవనికాం ) ప్రవిశ్య విచిత్రాం విహగైః అభినాదితాం సర్వతః రాజతైః కాంచనశ్చైవ పాదపైః ఆవృతాం (అశోకవనికాం దదర్శ)||(తత్ర) హనుమాన్ కపిః విచిత్రాం విహగైః మృగ సంఘైశ్చ ఉదితాదిత్య సంకాశం (ఇవ) చిత్రకాననాం దదర్శ|| పుష్పోపగఫలోపగైః నానావిధైః వృక్షైః వృతాం మత్తైః కోకిలైః భృంగరాజైః చ నిత్య సేవితాం (అశోకవనికాం దదర్శ)||ప్రహృష్ట మనుజేకాలే మృఃగ పక్షి సమాకులే మత్తబర్హిణసంఘుష్టామ్ నానాద్విజ గణాయుతాం (తాం అశోకవనికాం దదర్శ)||

తా|| హనుమంతుడు ఆ చిత్రమైన పక్షులకిలకిలారావములతో నిండినది , వెండి బంగారు రంగుల కల చెట్లతో నిండినది అగు ఆ అశోకవనమును ప్రవేశించెను. వానరుడగు హనుమంతుడు చిత్ర విచిత్రమైన పక్షి సంఘములతో మృగసంఘములతో ఉదయభాను సూర్యునిలా ప్రకాశిస్తున్నవనవాటికను చూచెను. ఫలపుష్పములతో నిండిన వృక్షములతో నిండిన ఆ వనవాటిక మదించిన కోకిలలచేత తుమ్మెదలచేత ఎల్లప్పుడూ సేవింఛబడినది. మనుష్యులకు హృదయానందము కలిగించు ఆ వనవాటిక మదించిన నెమళ్ళ గుంపులతో అనేక రకములైన పక్షుల గుంపులతో అలరారుతున్నది.

శ్లో|| మార్గమాణో వరారోహాం రాజపుత్రీం అనిందితామ్|
సుఖప్రసుప్తాన్ విహగాన్ బోధయామాస వానరః||9||
ఉత్పతత్భిః ద్విజగణైః పక్షైః సాలాః సమాహతాః|
అనేక వర్ణా వివిధా ముముచుః పుష్పవృష్టయః||10||
పుష్పావకీర్ణః శుశుభే హనుమాన్ మారుతాత్మజః|
అశోకవనికా మధ్యే యథా పుష్పమయో గిరిః||11||

స|| వానరః వరారోహాం అనిందితాం రాజపుత్రీం మార్గమాణః సుఖప్రసుప్తాన్ విహగాన్ బోధయామాస||ఉత్పతత్భిః ద్విజగణైః పక్షైః సమాహతః సాలాః అనేకవర్ణః వివిధాః పుశ్పవృష్టయః ముముచుః||అశోకవనికా మధ్యే పుష్పావకీర్ణః హనుమాన్ మారుతాత్మజః పుష్పమయో గిరిః యథా శుశుభే||

తా|| ఆ వానరుడు అమిత సౌందర్యవతి దోషములు లేనిది అగు ఆరాజపుత్రిని వెదుకుతూ సుఖముగా నిద్రపోతున్న పక్షులను లేపెను. ఆక్కడ వృక్షములు ఆ విధముగా లేచి ఎగురుతున్న పక్షుల రెక్కలచేత కొట్టబడి అనేక రంగులు కల పుష్పముల పుష్పవాన కురిపించినవి. ఆ అశోకవనిక మధ్యలో పుష్పములచేత కప్పబడిన హనుమంతుడు పుష్పమయమైన కొండలా శోభించెను.

శ్లో|| దిశః సర్వాః ప్రధావంతం వృక్ష షణ్డగతం కపిమ్|
దృష్ట్వా సర్వాణి భూతాని వసన్త ఇతి మేనిరే||12||
వృక్షేభ్యః పతితై పుష్పైః అవకీర్ణా పృథగ్విధైః|
రరాజ వసుధా తత్ర ప్రమదేవ విభూషితా||13||
తరస్వినా తే తరవస్తరసాభి ప్రకమ్పితాః|
కుసుమాని విచిత్రాణి ససృజుః కపినా తదా||14||

స|| వృక్ష షణ్డగతం దిశః సర్వాః ప్రధావంతం కపిం దృష్ట్వా సర్వాణి భూతాని వసంత ఇతి మేనిరే|| తత్ర వృక్షేభ్యః పతితైః పుష్పైః అవకీర్ణా పృధ్వీ విభూషితా ప్రమద ఏవ రరాజ|| తదా తరస్వినా కపినా తరసా అభిప్రకమ్పితాః తే తరవః విచిత్రాణి పుష్ఫాణి ససృజుః ||

తా|| ఆ వృక్షముల మధ్యలో అని దిశలలో పుష్పమయ రూపములో సంచరిస్తున్న హనుమానుని చూచి సాక్షాత్తు వసంతుడే సంచరిస్తున్నాడా అని అన్ని భూతములు భావించాయి. ఆ వృక్షములనుంచి పడిన పుష్పములతో విరాజిల్లుచున్న ఆ భూమి అందముగా అలంకరింపబడిన స్త్రీలా ఒప్పుచుండెను. అలా కదులుతూవున్న చేతులు గలవానరుని కదలికకి కంపింపబడిన వృక్షములు చిత్రవిచిత్రమైన పుష్పములను రాల్చినవి.

శ్లో|| నిర్దూత పత్రశిఖరాః శీర్ణపుష్పఫలాద్రుమాః|
నిక్షిప్త వస్త్రాభరణా ధూర్త ఇవ పరాజితః||15||
హనుమతా వేగవతా కమ్పితాస్తే నగోత్తమాః|
పుష్పపర్ణ ఫలాన్యాసు ముముచుః పుష్పశాలినః||16||

స|| నిర్ధూత పత్రశిఖరాః శీర్ణపుష్పఫలాః ద్రుమాః పరాజితాః నిక్షిప్త వస్త్రాభరణాః ధూర్తా ఇవ (దదర్శ)|| వేగవతా హనుమతా కంపితాః పుష్పశాలినః తే నగోత్తమాః పుష్పవర్ణ ఫలాన్యాసుః ముముచుః||

తా|| ఆకులులేనివి పొడుగైనవి పుష్పములు ఫలములు రాలిపోయిన ఆ వృక్షములు, వస్త్రాభరణములను కూడా ఓడిఫోయిన జూదరులవలె వున్నాయి. వేగముగా తిరుగుచున్న హనుమంతుని చేత కంపింపబడిన పుష్పములతో నిండిన ఆ వృక్షములు పుష్పములను ఆకులను ఫలములను రాల్చాయి.

శ్లో|| విహఙ్గ సంఘైర్హీనాస్తే స్కన్ధమాత్రాశ్రయా ద్రుమాః|
బభూవురగమాః సర్వే మారుతేనేవ నిర్థుతాః||17||

స|| సర్వే తే ద్రుమాః మారుతేన వినిర్ఘుతాః అగమాః ఇవ విహంగసంఘైః విహీనాః స్కన్ధమాత్రాశ్రయాః బభూవ||

తా|| పక్షులచేత విడువబడిన, ఆ ఫలపుష్పములేని బోదెలతో వున్న ఆ వృక్షములు అన్నీపెనుగాలితాకిన వృక్షములవలె బోసిపోయి ఉన్నాయి.

శ్లో|| నిర్ధూత కేశీ యువతి ర్యథా మృదిత వర్ణికా|
నిష్పీతశుభ దన్తోష్ఠీ నఖైర్దన్తైశ్చ విక్షతా ||18||
తథా లాంఙ్గూలహస్తైశ్చ చరణాభ్యాంచ మర్దితా|
బభూవాశోకవనికా ప్రభగ్నవరపాదపా||19||

స|| లాంగూల హస్తైశ్చ చరణాభ్యాం చ మర్దితా అశోకవనికా ప్రభగ్న వర పాదపాః నిర్ధూత కేశీ మృదిత వర్ణకా నిష్పీత శుభ దంతోష్టీ నఖదంతైశ్ఛ విక్షతా యువతీ యథా బభూవ||

తా|| హనుమంతుని తోక చేత హస్తములు కాళ్ళచేత మర్దించబడిన వృక్షములు కల ఆ అశోకవనిక జుట్టువిరబోసిన , బొట్టుచెదిరిన, తొలగిపోయిన అంగరాగములు కల పెదవులు దంతములు కల , నఖదంతములచే గాయపడిన యువతి వలె ఉండెను.

శ్లో|| మహాలతానాం దామాని వ్యథమత్తరసా కపిః|
యథా ప్రావృషి విన్ధ్యస్య మేఘజాలాని మారుతః||20||

స|| కపిః మహాలతానాం దామాని తరసా మారుతః ప్రావృషీ నిబంధస్య మేఘజాలాని యథా వ్యథమత్||

తా|| ఆ వానరుడు పెద్ద తీగలపొదలను మారుతము మేఘజాలములను చెల్లాచెదరు చేసినట్లు చిన్నాభిన్నము చేసెను.

శ్లో|| స తత్ర మణి భూమీశ్చ రాజతీశ్చ మనోరమాః|
తథాకాఞ్చన భూమీశ్చ దదర్శ విచరన్ కపిః|| 21||

స||తత్ర విచరన్ సః కపిః మణిభూమిశ్చ రాజతీశ్చ తథా మనోరమాః కాంచనభూమిశ్చ దదర్శ||

తా|| అక్కడ తిరుగుచున్న ఆ వానరుడు మణులతోను వెండితోనూ అలాగే బంగారపు పలకలతో ఉన్న భూమిని చూచెను.

శ్లో|| వాపీశ్చ వివిధాకారాః పూర్ణాః పరమవారిణా|
మహార్హైః మణిసోపానైః ఉపపన్నాస్తతస్తతః||22||
ముక్తాప్రవాళసికతాః స్పాటికాన్తర కుట్టిమాః |
కాఞ్చనైస్తరుభిశ్చిత్రైః తీరజైరుపశోభితాః||23||
పుల్లపద్మోత్పలవనాః చక్రవాకోపకూజితాః|
నత్యూహరుత సంఘూష్టా హంససారసనాదితాః||24||
దీర్ఘాభిర్ద్రుమయుక్తాభిః సరిద్భిశ్చ సమంతతః|
అమృతోపమ తోయాభిః శివాభిరుపసంస్కృతాః||25|
లతాశతైరవతతాః సన్తాన కుసుమావృతాః|
నానాగుల్మావృతఘనాః కరవీర కృతాన్తరాః||26||

sa|| పరమవారిణా పూర్ణాః తతః తతః మహార్హైః మణిసోపానైః ఉపపన్నాః వాపీశ్చ (దదర్శ)|| ముక్తప్రవాళసికతాః స్ఫాటికాంతరకుట్టిమాః కాంచనైః చిత్రైః తరుభిః తీరజైః ఉపశోభితా (వాపీశ్చ దదర్శ) ||పుల్లపద్మోత్పల వనాః చక్రవాకోపకూజితాః నత్యూహరతసంఘుష్టాః హంస సారనినాదితాః (వాపీశ్చ దదర్శ)|| దీర్ఘాభిః ద్రుమయుక్తాభిః అమృతోపమ తోయభిః శివాభిః సరద్భిః సమంతతః ఉపసంస్కృతాః ( వాపీశ్చ దదర్శ)||లతా శతైః అవతతాః సంతానకుశుమావృతాః నానా గుల్మ ఆవృత ఘనాః కరవీర కృతాంతరాః వాపీశ్చ దదర్శ||

తా|| వారిజలములతో పూర్ణముగావున్న ఉత్తమమైన మణులతో పొదగబడిన సోపానములు కల జలాశయములను చూచెను. అవి ముత్యాలతో పగడాలతో పొదగబడిన, స్ఫటికములతో పూసలతో నిండిన, పొదగబడిన బంగారపు చెట్లుకల తీరములతో వున్నవి. వికసించిన తామరలతో కలువలతో నిండి , చక్రవాకముల కూతలతో నిండిన, నీటికోళ్ళ ధ్వనులతో, హంస సారస పక్షులమధురనాదాములతో నిండి యున్నది. పొడవైన వృక్షములతో, అమృతమయమైన జలములతో శుభకరమైన సరస్సులతో నిండియున్నది. వందలకొలది లతలతో నిండి యున్నఅనేకరకములైన పొదలతో నిండిన, సంతానక వృక్షముల కుశుమములతో నిండిన, కరవీర వృక్షములతో నిండిన జలాశయములను చూచెను.

శ్లో|| తతోఽమ్బుధర సంకాశం ప్రవృద్ధ శిఖరం గిరిమ్|
విచిత్రకూటం కూటైశ్చ సర్వతః పరివారితమ్||27||
శిలాగృహైరవతతం నానావృక్షైః సమావృతమ్|
దదర్శ హరిశార్దూలో రమ్యం జగతి పర్వతమ్||28||

స|| తతః హరిశార్దూలః జగతి రమ్యం పర్వతం అంబుధరసంకాశం ప్రవృద్ధ శిఖరం విచిత్ర కూటం సర్వతః కూటైః పరివారితం శిలాగృహైః అవతతమ్ నానావృక్షైః సమావృతం గిరిం దదర్శ||

తా|| ఆ హరిశార్దూలము జగత్తులో రమ్యమైన మేఘములను అంటుకుంటున్న ఏత్తైన శిఖరములు కల పర్వతమును , చిత్రవిచిత్ర కూటములు కల , శిలాగృహములతో కూడిన పర్వతమును చూసెను.

శ్లో|| దదర్శ చ నగాత్తస్మాన్ నదీం నిపతితాం కపిః|
అఙ్కాదివ సముత్సత్య ప్రియస్య పతితాం ప్రియామ్||29||
జలే నిపతితాగ్రైశ్చ పాదపైరుపశోభితామ్|
వార్యమాణామివ క్రుద్ధాం ప్రమదాం ప్రియ బన్ధుభిః||30||
పునరావృత్తతోయాం చ దదర్శ స మహాకపిః|
ప్రపన్నామివ కాన్తస్య కాన్తాం పునురుపస్థితామ్||31||

స|| కపిః తస్మాత్ నగాత్ నిపతితాం నదీం ప్రియస్య అంకాత్ పతిత సముత్పత్య ప్రియాం ఇవ దదర్శ|| జలే నిపతితాగ్రైః పాదపైః ఉపశోభితాం ప్రియబంధుభిః వార్యమాణాం కృద్ధం ప్రమాదాం ఇవ (నదీం దదర్శ)|ఆవృత్తతోయాం కాంతస్య ప్రసన్నాం పునః ఉపస్థితాం కాంతామివ సః మహాకపిః దదర్శ||

తా|| ఆ వానరుడు ఆ పర్వతము పైనుండి కింద పడుతో వున్న నదిని చూచెను. అది ప్రియుని అంకమునుండి జారిపోతున్న ప్రియురాలివలె నుండెను. జలములో వంగివున్న వృక్షములతో శోభిస్తున్న నదులలో వృక్షముచే నిరోధింపబడిన జలములు ప్రియబంధువులచే నివారింపబడి న కోపగించిన స్త్రీవలె కనపడుచున్నవి. అలా వ్యతిరిక్తదిశలో తిరుగు వస్తున్న జలములు కాంతుని సాంత్వ వచనములతో ప్రసన్నురాలే తిరిగివస్తున్న కాంత వలె కనపడెను.

శ్లో|| తస్యాఽదూరాత్ సపద్మిన్యో నానాద్విజగణాయుతాః|
దదర్శ హరిశార్దూలో హనుమాన్ మారుతాత్మజః||32||
కృత్రిమాం దీర్ఘికాం చాపి పూర్ణాం శీతేన వారిణా|
మణిప్రవర సోపానాం ముక్తాసికతశోభితామ్||33||
వివిధైర్మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననామ్|
ప్రాసాదైః సుమహద్భిశ్చ నిర్మితైర్విశ్వకర్మణా||34||
కాననైః కృతిమైశ్చాపి పర్వత సమలంకృతామ్|

స|| హరిశార్దూలః మారుతాత్మజః సః హనుమాన్ తస్య అదూరాత్ నానాద్విజగణాయుతాః పద్మిన్యాః దదర్శ|| సీతేన వారిణా పూర్ణాం మణిప్రవరసోపానాం ముక్తాశికతశోభితాం వివిధైః మృగసంఘైశ్చ విచిత్రాం చిత్రకాననాం విశ్వకర్మణా నిర్మితైః సమహద్భిః ప్రాసాదైః కృత్రిమైః కాననైశ్చాపి సర్వతః సమలంకృతం దీర్ఘికాం చాపి దదర్శ||

తా|| మారుతాత్మజుడు హరిశార్దూలుడు అయిన హనుమంతుడు అక్కడ దగ్గరలోనే అనేక పక్షుల సమూహములతో, తామరలతో నిండిన, చల్లని నీళ్లతో నిండిన, మణులతో పొదగబడిన సోపానములు కల ముత్యాల ఇసుకతో శోభిల్లుచున్న, అనేకరకముల మృగముల గుంపులతో కూడిన చిత్ర విచిత్రములైన విశ్వకర్మచే నిర్మింపబడిన అనేకరకములుగా అలంకరింపబడిన ప్రాసాదములు కల సరస్సును చూచెను.

శ్లో|| యే కేచిత్ పాదపా స్తత్ర పుష్పోపగపలోపమాః||35||
సచ్చత్రాః సవితర్దీకాః సర్వే సౌవర్ణవేదికాః|

స||తత్ర పుష్పగఫలోఫగాః| యే కేచిత్ పాదపాః సర్వే సచ్ఛత్రాః సవితర్దికాః సౌవర్ణ వేదికాః ||

తా|| ఆ వృక్షములు ఫలపుష్పభరితములై వున్నవి. కొన్ని వృక్షములకింద చత్రములు బంగారు వేదికలు అమర్చబడి ఉన్నవి.

శ్లో|| లతాప్రతానైర్బహుభిః పర్ణైశ్చ బహుభిర్వృతామ్||36||
కాఞ్చనీం శింశుపామేకామ్ దదర్శ హరియూధపః|
వృతాం హేమమయీభిస్తు వేదికాభిః సమంతతః||37||

స||హరియూథపః బహుభిః లతాప్రతానైః బహుభిః పర్ణైశ్చ సమంతతః వృతామ్ హేమమయీభిః వేదికాభిః వృతామ్ కాంచనీం ఏకాం శింశుపాం దదర్శ||

తా|| ఆ వానరోత్తముడు అనేక లతలతో ఆకులతో నిండియున్న బంగారు వేదికతో వున్న శింశుపావృక్షమును చూచెను.

శ్లో|| సోఽపశ్యత్ భూమిభాగాంశ్చ గర్తప్రస్రవణాని చ|
సువర్ణవృక్షాన్ అపరాన్ దదర్శ శిఖిసన్నిభాన్ ||38 ||
తేషాం ద్రుమాణాం ప్రభయా మేరో రివ దివాకరః|
అమన్యత తదా వీరః కాఞ్చనోఽస్మీతి వానరః||39||
తాం కాఞ్చనైస్తరుగణైః మారుతేన చ వీజితామ్|
కింకిణీశతనిర్ఘోషామ్ దృష్ట్వా విస్మయ మాగమత్||40||

స|| సః భూమిభాగాంశ్ఛ గర్తప్రస్రవణాని చ అపరాన్ శిఖిసన్నిభాన్ సువర్ణవృక్షాన్ అపశ్యత్ || తదా వీరః వానరః మేరోః ప్రభయా దివాకర ఇవ తేషాం ద్రుమాణాం ప్రభయా కాంచనః అస్మి ఇతి మన్యత|| ( సః హనుమాన్ ) కాంచనైః తరుగణైః మారుతేన వీజితామ్ క్రీడకాని శతనిర్ఘోషాం తాం దృష్ట్వా విస్మయం ఆగమత్||

తా|| ఆ వానరుడు అక్కడ కొన్ని సెలయూటలతో వున్న భూమి భాగములు, పొడవైన శిఖరముల వలె నున్న బంగారు వన్నెగల వృక్షములు చూచెను. ఆ వానరవీరుడు ఆ వృక్షముల కాంతి చూసి తను మేరుపర్వతముల కాంతిలో వెలుగుచున్న దివాకరుని వలే నున్నవాడని తలచెను. బంగారురంగు కల శాఖలు గాలిలోవూగుతూ ఆ గాలి సడలికిచే శబ్దము చేస్తున్న అనేకమైన చిరుగంటల ఘోష చూసి ఆ వానరుడు విస్మయము పొందెను.

శ్లో|| స పుష్పితాగ్రాం రుచిరాం తరుణాఙ్కుర పల్లవామ్|
తా మారుహ్య మహాబాహుః శింశుపాం పర్ణసంవృతామ్||41||
ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామదర్శనలాలసామ్|
ఇతశ్చేతశ్చ దుఃఖార్తాం సంపతన్తీం యదృఛ్ఛయా||42||

స|| మహాబాహుః సః పుష్పితాగ్రాం రుచిరాం తరుణాంకురపల్లవామ్ పర్ణసంవృతాం తాం ఆరుహ్య ' రామదర్శనలాలసామ్ వైదేహీం ఇతః ద్రక్ష్యామి (ఇతి మన్యత) | దుఃఖార్తాం యదృచ్ఛయా ఇతశ్చ ఇతశ్చ సంపతన్తీం (తాం ద్రక్ష్యామి)|

తా|| అ మహాబాహువు విరబూచిన కొమ్మలు కల, లేత చిగుళ్ళ అంకురాలు కల కోమ్మలతో నున్న ఆ శింశుపా వృక్షము ఎక్కి ' రామదర్శన లాలస' అయిన వైదేహిని, దుఖములో ఇక్కడ అక్కడ తిరుగుతూ వున్న సీతను అనుకోకుండా ఇక్కడ చూచెదనేమో అని అనుకొనెను.

శ్లో|| అశోకవనికా చేయం దృఢం రమ్యా దురాత్మనః|
చమ్పకైః చన్ద నైశ్చాపి వకుళైశ్చ విభూషితా||43||

స|| దృఢం ఇయం అశోకవనికా రమ్యా చంపకైః చన్దనైశ్చ వకుళైశ్చాపి విభూషితా దురాత్మనః||

తా|| రమ్యమైన చంపక చందన వకుళ వృక్షములతో కల దృఢమైన ఈ అశోకవనిక తప్పక ఆ దురాత్ముడిదే.

శ్లో|| ఇయం చ నళీనీ రమ్యా ద్విజసంఘనిషేవితా|
ఇమాం సా రామమహిషీ నూనమేష్యతి జానకీ||44||
సా రామా రామమహిషీ రాఘవస్య ప్రియా సతీ|
వనసంచార కుశలా నూనమేష్యతి జానకీ||45||
అథవా మృగశాబాక్షీ వనస్యాస్య విచక్షణా|
వనమేష్యతి సా‌ర్యేహ రామచి‍న్తానుకర్శితా||46||

స|| ద్విజసంఘనిషేవితా ఇయం నళీనీ చ రమ్యా | సా రామమహిషీ జానకీ నూనం ఇమామ్ ఏష్యతి|| సా రామా రామమహిషీ రాఘవస్య ప్రియా వనసంచార కుశలా జానకీ నూనం ఏష్యతి || అథవా మృగశాభాక్షీ అస్య వనస్య విచక్షణా రామచింతానుకర్శితా సా ఆర్యా ఇహ వనం ఏష్యతి ||

తా|| పక్షి సంఘములచేసేవింబడుచున్న ఈ అశోకవనిక రమ్యము. ఆ రామమహిషి జానకి తప్పక ఇక్కడ ఉండును. ఆ రామమహిషి రాఘవుని ప్రియురాలు వనసంచారములో కుశలురాలు. ఆమె ఇక్కడ తప్పక రావచ్చును. లేక లేడి వంటి కళ్ళు కల , వనజీవన విచక్షణాజ్ఞానము కల రాముని గురించి చింతాక్రాంతురాలైన పూజ్యురాలైన ఆ సీత ఇక్కడికి వచ్చును.

శ్లో|| రామశోకాభి సంతప్తా సా దేవీ వామలోచనా|
వనవాసే రతా నిత్యమ్ ఏష్యతే వనచారిణీ||47||
వనే చరాణాం సతతం నూనం స్పృహయతే పురా|
రామస్య దయితా భార్యా జనకస్య సుతా సతీ||48||

స|| రామశోకాభిసంతప్తా వామలోచనానిత్యం వనవాసే రతా సా దేవీ వనచారిణీ ఏష్యతే|| రామస్య దయితా భార్యా జనకస్య సుతా సతీ పురా వనే చరాణాం స్పృహ్యతే నూనమ్||

తా|| రాముని ఏడబాటుతో కలిగిన శోకములో మునిగియున్నవామలోచన , వనవాసములో మక్కువ గల ఆ వనచారిణి ఇక్కడికి వచ్చును. రాముని ప్రియభార్య జనకుని సుత, సతీ వనములో సంచరించువారిపట్ల ఆదరణ వుండుట తథ్యము.

శ్లో|| సన్ధ్యాకాలమనాః శ్యామా ధ్రువ మేష్యతి జానకీ|
నదీం చేమాం శివజలాం సన్ధ్యార్థే వరవర్ణినీ||49||
తస్యాశ్చానురూపేయం అశోకవనికా శుభా|
శుభాయా పారివేన్ద్రస్య పత్నీ రామస్య సమ్మతా||50||
యదిజీవతి సా దేవీ తారాధిపనిభాననా|
ఆగమిష్యతి సాఽవశ్య మిమాం శివజలాం నదీమ్||51||

స|| శ్యామా వరవర్ణినీ జానకీ సంధ్యాకాలమనాః శుభజలామ్ ఇమాం నదీం సంధ్యార్థే ధృవం ఏష్యతి|| యా పార్థివేంద్రస్య రామస్య సమ్మతా శుభా పత్నీ తస్యాః శుభా ఇయం అశోకవనికా అనురూపమపి చ||తారాధిపనిభాననా సా దేవీ జీవతి యది సా అవశ్యమ్ ఇమామ్ శివ జలం నదీం ఆగమిష్యతి||

తా|| మంచి రంగుకల ఆ సీత, సంధ్యాకాలము గుర్తించి ఈ శుభకరమైన జలములుకల ఈ నదికి తప్పక వచ్చును. శుభప్రదమైన ఈ వనము రాజాధిరాజైన రాముని పత్నిమంగళ ప్రదురాలైన సీతకు నివశింపతగినది గా వున్నది. చంద్రబింబము వంటి ముఖము కల ఆ సీతాదేవి జివించియుంటే ఈ శుభప్రదమైన జలములు ఉన్న ఈ నది వద్దకు వచ్చును.

శ్లో|| ఏవం తు మత్వా హనుమాన్ మహాత్మా
ప్రతీక్షమాణో మనుజేన్ద్రస్య పత్నీమ్|
అవేక్షమాణాశ్చ దదర్శ సర్వమ్
సుపుష్పితే పర్ణఘనే నిలీనః||52||

స|| మహాత్మా హనుమాన్ ఏవం మత్వా మనుజేంద్రపత్నీం ప్రతీక్షమాణః సుపుష్పితే పర్ణఘనే నిలీనః అవేక్షమాణశ్చ సర్వం దదర్శ||

తా|| ఈ విధముగా హనుమంతుడు అలోచిస్తూ ఆ మనుజేంద్ర పత్నిని రాకకై నిరీక్షిస్తూ ఆ పుష్పములు కల కొమ్మల లో దాగి ఆన్ని చోటలా పరికించెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే చతుర్దశస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో పదునాలుగవ సర్గ సమాప్తము

||ఓం తత్ సత్||

||ఓం తత్ సత్||
శ్లో|| స ముహూర్తమివ ధ్యాత్వా మనసా చాధిగమ్యతామ్|
అవప్లుతో మహాతేజాః ప్రాకారం తస్య వేశ్మనః||1||
స|| సః మహాతేజః ముహూర్తమివ ధ్యాత్వా మనసా తాం (సీతాం) అధిగమ్య తస్య వేశ్మనః ప్రాకారం అవప్లుతః||
తా|| ఆ మహాత్ముడు ధ్యానము చేసి ఒక క్షణములో సీతను చేరి, ఒక గంతులో ఆ ప్రాకారము చేరెను.
||ఓం తత్ సత్||

||ఓం తత్ సత్||
శ్లో|| ఏవం తు మత్వా హనుమాన్ మహాత్మా
ప్రతీక్షమాణో మనుజేన్ద్రస్య పత్నీమ్|
అవేక్షమాణాశ్చ దదర్శ సర్వమ్
సుపుష్పితే పర్ణఘనే నిలీనః||52||
స|| మహాత్మా హనుమాన్ ఏవం మత్వా మనుజేంద్రపత్నీం ప్రతీక్షమాణః సుపుష్పితే పర్ణఘనే నిలీనః అవేక్షమాణశ్చ సర్వం దదర్శ||
తా|| ఈ విధముగా హనుమంతుడు అలోచిస్తూ ఆ మనుజేంద్ర పత్నిని రాకకై నిరీక్షిస్తూ ఆ పుష్పములు కల కొమ్మల లో దాగి ఆన్ని చోటలా పరికించెను.
||ఓం తత్ సత్||